Online train ticket booking. IRCTC ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్లో రైలు టిక్కెట్ బుకింగ్ చేయడం ఎలా?

భారతదేశంలో ప్రజా రవాణా యొక్క ప్రధాన మరియు ముఖ్యమైన మార్గాలలో ఒకటి భారతీయ రైల్వే. భారతీయ రైల్వేల ద్వారా రోజుకు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
ప్రయాణికులు తమ టిక్కెట్లను IRCTC website ఐఆర్సిటిసి వెబ్సైట్ ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకోవచ్చు.
రైల్వే స్టేషన్లలో, రిజర్వేషన్ కార్యాలయాలలో మరియు వారి సమీప ఏజెంట్ల వద్ద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
Online train ticket booking. IRCTC ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్లో రైలు టిక్కెట్ బుకింగ్ చేయడం ఎలా?
- వినియోగదారు పేరు, పాస్‌వర్డ్, వ్యక్తిగత వివరాలు మరియు చిరునామాతో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి.
- బయలుదేరే స్టేషన్ (From), గమ్యస్థానం (To) స్టేషన్లను ఎంచుకోండి.
- ప్రయాణ తేదీ, క్లాస్ మరియు కేటగిరీ ఎంచుకోండి.
- Search బటన్‌పై క్లిక్ చేయండి.
- ప్రయాణించే రైలు మరియు తరగతి ఎంచుకొని Book Now పై క్లిక్ చేయండి.
- ప్రయాణికుల పేరు మరియు వయసు వివరాలు ఇచ్చి, టికెట్ ధర క్రెడిట్/డెబిట్/నెట్ బ్యాంకింగ్/UPI ద్వారా చెల్లించండి.
Passenger Name Record PNR number – ప్యాసింజర్ నేమ్ రికార్డు పిఎన్ఆర్ నెంబర్
- పిఎన్ఆర్ నెంబర్ ఉపయోగించి మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ (Waiting list ticket) స్టేటస్ తెలుసుకోండి.
- ఆన్లైన్లో రైలు నడుస్తున్న ప్రత్యక్ష స్థితి (live position) తెలుసుకోవడం ఎలా? | Know train running status online.
ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి 90 రోజుల ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు.